e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, November 27, 2026

జేకేఐవి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం..

ఘనంగా జేకేఐవి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
– కళాకారుల సంక్షేమం, సంస్థ అభివృద్ధికి కృషి
– జగిత్యాల కళాకారుల ఐక్య వేదిక అధ్యక్షులు బోగే అశోక్

జగిత్యాల, నవంబర్ 27, మన భారత్ :
జగిత్యాల జిల్లాలోని కళాకారుల సంక్షేమము, సంస్థ అభివృద్ధికై నూతన పాలకవర్గం నిరంతరం కృషి చేస్తుందని సంఘం నూతన అధ్యక్షులు బోగే అశోక్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక బండారి గార్డెన్ లో జగిత్యాల కళాకారుల ఐక్య వేదిక నూతన పాలకవర్గం సభ్యుల ప్రమాణ స్వీకారంను వ్యవస్థపాక కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద అమరులైన కళాకారులకు నివాళులు అర్పించారు,

అనంతరం బైకు ర్యాలీగా వచ్చి, చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బండారి గార్డెన్ ఫంక్షన్ హాలులో నూతన పాలకవర్గ సభ్యులచే వ్యవస్థపాక కమిటీ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించి, నూతన పాలకవర్గం సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా అధ్యక్షులు అశోక్ తో పాటు వ్యవస్థపాక, పాలకవర్గం కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఐక్యంగా జగిత్యాల జిల్లా కళాకారులూ నిలవడం అభినందనీయం అన్నారు. జగిత్యాల కళాకారుల ఐక్య వేదిక రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందనడంలో ఎలాంటి అతిషయోక్తి లేదన్నారు.

కళాకారుల ఐక్య వేదిక ద్వారా సహచర కళాకారులకు ప్రోత్సాహం అందించే దిశగా చర్యలు గైకొంటామని తెలిపారు. అందరు ఐక్యంగా ఉండి సంఘం పటిష్టత, నూతన కమిటీకి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. వ్యవస్థపాక కమిటీ, నూతన కమిటీ సమన్వయముతో జిల్లా కళాకారుల ఐక్య వేదిక బలోపేతం కు నిరంతరం కృషి చేస్తామన్నారు. నూతన పాలకవర్గం సభ్యుల సంక్షేమం కొరకు అనేక అంశాలను పరిగణలోకి తీసుకోని వాటి అమలు దిశగా ఐక్యంగా ముందుకు వెళ్తుందని అశోక్ తెలిపారు. తమ వల్ల వ్యవస్థపాక కమిటీ కి కానీ, సభ్యులకు గానీ ఇబ్బంది కలిగితే పెద్దమనసుతో క్షమించాలని కోరారు.

భవిష్యత్ లో అందరి సమన్వయముతో ముందుకి సాగుతామని, ఫిర్యాదుల కోరకు ఒక సభ్యున్ని నియమించి సభ్యుల ఇబ్బందుల పరిష్కారంకు కమిటీ కృషి చేస్తుందన్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో కమిటీ బాధ్యులు బొడ్డుపెల్లి లక్ష్మి నారాయణ, మెండు హరీష్ పటేల్,రాజారాం మోహన్ రెడ్డి, క్రాంతి దగడ్, మల్యాల సతీష్ కుమార్, పెరుమాండ్ల విజయలక్ష్మి, బొడ్డు సౌజన్య, భూక్యా గంగాధర్ నాయక్, చిరంజీవి, గుండేటి సందీప్, శ్రీ చరణ్, శ్రీనివాస్, సంగెపు బాబు, గజ్జెల వందన, ఇప్పల లక్ష్మి, గుండా ఉమ, వ్యవస్థపాక కమిటీ బాధ్యులు ఎస్. వి మల్లిక్ తేజ, ఇస్లావత్ కమల్ నాయక్, జె.డి సుమన్, పలిగిరి రాజేందర్, చుంచు మల్లేశం, అభి, ఓరుగంటి శేఖర్, గీత, మామిడి మౌనిక, సిరి, డైరెక్టర్ రాజ్ నరేంద్ర కళాకారుల ఐక్యవేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE