e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, November 27, 2026

విద్యార్థుల సందడితో “అల్ఫోర్స్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వేడుకలు”

విద్యార్థుల సందడితో “అల్ఫోర్స్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వేడుకలు”
అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్, శివ విధి – ప్రీ-ప్రైమరీ విద్యార్థుల ప్రత్యేక కార్యక్రమం
జగిత్యాల, నవంబర్ 27, మన భారత్ :
అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి స్ఫూర్తిదాయకమైన మార్గదర్శకత్వంలో స్థానిక శివవీధిలోని అల్ఫోర్స్ ఇ- టెక్నో పాఠశాలలో ప్రీ-ప్రైమరీ విద్యార్థులచే వ్యవసాయ మార్కెట్ కమిటీ వేడుకలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించబడ్డాయని పాఠశాల నిర్వాహకులు చెప్పారు. ప్రారంభానికి ముందు వారు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి వ్యవసాయం, రైతులు మరియు మార్కెట్ల యొక్క ప్రాముఖ్యతను చక్కగా వర్ణించి చెప్పారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు వివిధ రకాల కూరగాయలు, పండ్లు మరియు నిత్యావసర వస్తువులను ప్రదర్శిస్తూ చిన్నపాటి మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. కొనుగోలు, అమ్మకం వంటి అంశాలను ఆటపాటల ద్వారా నేర్చుకున్నారు. అలాగే రైతుల ప్రాముఖ్యత, మార్కెట్ నిర్వహణ, వస్తువుల గుర్తింపు, లెక్కలు చెప్పడం వంటి విషయాలపై ప్రాథమిక అవగాహన కల్పించడం జరిగినదని వారు చెప్పారు. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సంభాషణా నైపుణ్యాలు, సామాజిక స్పృహ మరియు గణిత, విషయ పరిజ్ఞానం పెంపొందించబడుతాయని చెప్పారు. చిన్నారుల ఉత్సాహభరితమైన ప్రదర్శనలను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు. తరగతి గది బోధనతో పాటు ఆచరణాత్మక అనుభవమే సమగ్ర విద్యకు పునాది అని వారు చెప్పారు. ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో పాఠశాలలోని విద్యార్థుల్లో సృజనాత్మకత మరియు విషయ పరిజ్ఞానాన్ని పెంపొందిస్తున్నామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE