e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, November 26, 2026

గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి..

గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
– జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
– కొండగట్టు నుంచి జేఎన్టీయూ వరకు పర్యటన ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన
– హెలిప్యాడ్, ఆలయం, అతిథిగృహం, సమావేశ ప్రాంగణం, స్టాళ్లు, భోజన పరిసర ప్రాంతాల ఏర్పాట్ల తనిఖీ
– అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలి
– గవర్నర్ పర్యటన ఏర్పాట్లను ఎస్పీ అశోక్ కుమార్‌ తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్
జగిత్యాల/కొండగట్టు, నవంబర్ 26, మన భారత్ :
ఈ నెల 30న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా, పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి కొండగట్టు, జేఎన్టీయూ పరిసరాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి గవర్నర్ పర్యటనకు సంబంధించి వివిధ శాఖలు చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
– ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
నవంబర్ 30న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా జగిత్యాల జిల్లాకు చేరుకుని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుంటారని, అనంతరం కొండగట్టులోని జేఎన్టీయూలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో పర్యటనలోని ప్రతి అంశాన్ని ముందుగానే పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ముందుగా గవర్నర్ చేరుకోనున్న హెలిప్యాడ్‌ను పరిశీలించి, అక్కడ చేపడుతున్న బ్యారికేడింగ్, భద్రతా చర్యలు, ఇతర మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు. హెలిప్యాడ్ వద్ద అవసరమైన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ, పోలీసు శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

అనుమతి పొందిన వ్యక్తులు మాత్రమే హెలిప్యాడ్ వద్దకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, ప్రోటోకాల్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనంతరం గవర్నర్ బస చేయనున్న అతిథిగృహాన్ని పరిశీలించారు. అక్కడ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గౌరవ వందనం, జాతీయ గీతం, రాష్ట్ర గేయం ప్రదర్శనకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. అతిథిగృహం పరిసరాల్లో పరిశుభ్రత, విద్యుత్, తాగునీరు, భద్రత తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జేఎన్టీయూ కొండగట్టు అడ్మిన్ బ్లాక్ వద్ద గవర్నర్ పాల్గొననున్న సమావేశ ప్రాంగణాన్ని పరిశీలించి వేదిక, సీటింగ్, సౌండ్ సిస్టమ్, విద్యుత్ సరఫరా, ఇతర సాంకేతిక ఏర్పాట్లను తనిఖీ చేశారు.

సమావేశానికి హాజరయ్యే అధికారులు, ఇతర ప్రముఖులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో నివేదికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న వివిధ స్టాళ్లను పరిశీలించి, మహిళా సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులు, వారి జీవనోపాధి కార్యక్రమాలు, సాధించిన విజయాలను ప్రతిబింబించేలా స్టాళ్లను ఆకర్షణీయంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. గవర్నర్ స్టాళ్లను సందర్శించే సమయంలో మహిళా సంఘాల ప్రతినిధులు తమ కార్యకలాపాలు, విజయాలను వివరించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని డీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. తదుపరి కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ఆలయ పరిసరాలు, గవర్నర్ స్వాగత ఏర్పాట్లు, దర్శనం, అభిషేకం, ఇతర పూజా కార్యక్రమాల నిర్వహణపై పరిశీలించారు.

ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా పూర్ణకుంభ స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, తాగునీరు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గవర్నర్, ఇతర ప్రముఖులు, అధికారుల కోసం ఏర్పాటు చేయనున్న భోజన ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, తాగునీరు, వడ్డింపు తదితర అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.

జేఎన్టీయూ అడ్మిన్ బ్లాక్ సమీపంలో నిర్వహించనున్న నషా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీకి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ముఖ్యంగా యువతలో విస్తృత అవగాహన కల్పించేలా ర్యాలీ నిర్వహించాలని, పోలీసు శాఖ సహకారంతో జిల్లా సంక్షేమ శాఖ అధికారులు అవసరమైన జన సమీకరణ, ఇతర ఏర్పాట్లు చేయాలని సూచించారు

– ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ
గవర్నర్ పర్యటన నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. హెలిప్యాడ్, అతిథిగృహం, ఆలయం, జేఎన్టీయూ పరిసరాల్లో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, రూట్ భద్రతకు సంబంధించి ముందస్తు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. విధులకు కేటాయించిన పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. గవర్నర్ సమీక్షలో భాగంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్, నిక్షయ్ మిత్ర కార్యక్రమం, అనీమియా ముక్త్ భారత్, సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన, తల్లీబిడ్డల ఆరోగ్యం, పోషకాహార కార్యక్రమాల అమలుపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో రెవెన్యూ , పోలీస్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE