e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, November 25, 2026

బెల్ట్ షాపు నిర్వహణకు అక్రమ అనుమతులు.. ఆరుగురు విడిసి సభ్యుల అరెస్ట్

బెల్ట్ షాపు నిర్వహణకు అక్రమ అనుమతులు.. ఆరుగురు విడిసి సభ్యుల అరెస్ట్

రూ.15 వేల చొప్పున వసూలు చేసినట్లు ఆరోపణలు.. ఏడుగురిపై కేసు నమోదు, ఆరుగురికి రిమాండ్

మన భారత్, గుడిహత్నూర్: నవంబర్ 25:

గ్రామంలో అక్రమంగా బెల్ట్ షాపు నిర్వహణకు అనుమతులు ఇచ్చి, గ్రామాభివృద్ధి పేరుతో డబ్బులు వసూలు చేసిన ఆరుగురు విడిసి (VDC) సభ్యులను గుడిహత్నూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గుడిహత్నూర్ మండలంలోని మన్నూర్ గ్రామం సాయినగర్‌లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మన్నూర్ గ్రామంలోని సాయినగర్‌కు చెందిన సోలంకి మహేష్ (31) ఎలాంటి అనుమతులు లేకుండా బెల్ట్ షాపు నిర్వహిస్తూ, మద్యం బాటిళ్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుడిహత్నూర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో నవంబర్ 15న గుడిహత్నూర్ ఎస్ఐ ఎల్. శ్రీకాంత్ తన సిబ్బందితో కలిసి సంబంధిత ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మహేష్‌ను అదుపులోకి తీసుకొని, అతని వద్ద నుంచి 10 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్రామంలో బెల్ట్ షాపు నిర్వహించాలంటే గ్రామాభివృద్ధి పేరుతో రూ.15,000 చెల్లించాలని విడిసి సభ్యులు తనను బెదిరించి బలవంతంగా డబ్బులు వసూలు చేసినట్లు మహేష్ విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విచారణలో అందిన వివరాల ఆధారంగా బెల్ట్ షాపు నిర్వహించిన సోలంకి మహేష్‌తో పాటు డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు విడిసి సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఏడుగురిపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. వీరిలో ఆరుగురు విడిసి సభ్యులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ ఎల్. శ్రీకాంత్ వెల్లడించారు.

నిందితుల వివరాలు:

* సోలంకి మహేష్ (31) – తండ్రి నారాయణ, సాయినగర్, మన్నూర్.

* తెలంగే జ్ఞానేశ్వర్ (32) – తండ్రి రాంచందర్, మన్నూర్.

* పూరి గజానంద్ (37) – తండ్రి ప్రకాష్, సాయినగర్, మన్నూర్.

* బాబు ముండే (49) – తండ్రి మారుతి, సాయినగర్, మన్నూర్.

* రాథోడ్ ఏకనాథ్ (45) – తండ్రి నానా, సాయినగర్, మన్నూర్.

* కడం దిగంబర్ (55) – తండ్రి విశ్వనాథ్, సాయినగర్, మన్నూర్.

* తెలంగ్ నారాయణ (40) – తండ్రి రాంచందర్, సాయినగర్, మన్నూర్.

గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలు, అనధికార వసూళ్లకు పాల్పడే వారిపై చట్టపన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని పోలీసులు హెచ్చరించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE