e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

పాలకొండ దత్తు సీడీ ఆవిష్కరణ సభ.. పాల్గొన్న ప్రముఖులు

పాలకొండ దత్తు సీడీ ఆవిష్కరణ సభ.. పాల్గొన్న ప్రముఖులు

మన భారత్, తాంసి:నవంబర్ 23,

తాంసి మండలం కపర్ల గ్రామానికి చెందిన గాయకుడు పాలకొండ దత్తు రూపొందించిన సీడీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆవిష్కరణ సభలో పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, కళాకారులు, గాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌తో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు కౌడాల సంతోష్, గ్రామ సర్పంచ్ అరుణ్ కుమార్, వార్డు సభ్యుడు ప్రభాకర్, పీఏసీఎస్ డైరెక్టర్ బుజ్జన్న హాజరయ్యారు. అలాగే ప్రముఖ గాయకులు గట్టు వెంకట్రావు, గట్టు అనిల్ తదితరులు పాల్గొని పాలకొండ దత్తును అభినందించారు.

స్థానిక కళాకారులు తమ ప్రతిభను వెలికితీస్తూ సంగీత, సాంస్కృతిక రంగాల్లో ముందుకు సాగడం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కళాకారులకు ప్రోత్సాహం లభిస్తే మరింత ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

సీడీ ఆవిష్కరణ కార్యక్రమంలో స్థానికులు, అభిమానులు, కళాభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE