e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

మత్స్యకారుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా.. పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే పాయల్ శంకర్

మత్స్యకారుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా.. పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే పాయల్ శంకర్

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 21,

ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని గంగపుత్ర సంఘ భవనంలో మత్స్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగాదేవి, భీష్ముడి చిత్రపటాలకు పూజలు నిర్వహించి మత్స్యకారులకు ప్రపంచ మత్స్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను రాబోయే శాసనసభ సమావేశాల్లో తప్పకుండా ప్రస్తావించి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మత్స్యకార కుటుంబాల జీవనోపాధికి చెరువులు, జలవనరులు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఖానాపూర్ చెరువులో పేరుకుపోయిన గొర్రపు డెక్కను తొలగించే పనులు చేపడుతున్నట్లు తెలిపారు. దీనివల్ల మత్స్య సంపద అభివృద్ధికి, మత్స్యకారుల ఉపాధికి ప్రయోజనం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపం కారణంగా 40 నుంచి 50 శాతం సబ్సిడీతో అమలయ్యే పథకాలు గంగపుత్రులకు అందడం లేదని ఎమ్మెల్యే విమర్శించారు. అర్హులైన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా సంబంధిత అధికారులు, ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేయడంతో పాటు ఇప్పటికే ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల ఉపాధిని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. మత్స్యకారులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, అవసరమైన మౌలిక సదుపాయాలు, చేపల రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ రంగానికి సంబంధించిన అవసరాల కోసం ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు చెరువులు, కుంటల్లో చేపల పెంపకానికి అనుకూల వాతావరణం కల్పిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. మత్స్యకార సంఘాల సమస్యలను సంబంధిత ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘాల సభ్యులతో పాటు బీజేపీ కౌన్సిలర్లు పోశాలు, హనుమాన్లు, శ్రీకాంత్, మనోజ్, జీవన్, సాయి, ముకుంద, భూమన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE