e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

మూగజీవాల సంరక్షణకు యువత ముందుకు రావడం అభినందనీయం: మాజీ మంత్రి

మూగజీవాల సంరక్షణకు యువత ముందుకు రావడం అభినందనీయం: మాజీ మంత్రి జోగు రామన్న

జీవజ్యోతి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తా.. జోగు రామన్న హామీ

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 20, సమాజ సేవలో యువత చురుకైన పాత్ర పోషించడంతో పాటు మూగజీవాల సంరక్షణకు ముందుకు రావడం అభినందనీయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. మూగజీవాలకు ఆహారం అందించడం, వాటి సంరక్షణకు కృషి చేయడం వంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జీవజ్యోతి ఫౌండేషన్ సభ్యులు మాజీ మంత్రి జోగు రామన్నను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను వివరించారు. ముఖ్యంగా మూగజీవాల సంరక్షణ, వాటికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం వంటి కార్యక్రమాల గురించి వివరించారు.

ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. నేటి సమాజంలో యువత కేవలం వ్యక్తిగత అభివృద్ధికే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతను కూడా గుర్తించాలని సూచించారు. సేవా భావంతో ముందుకు వచ్చి మూగజీవాల ఆకలి తీర్చడం, వాటి సంరక్షణకు కృషి చేయడం గొప్ప విషయమన్నారు. జీవజ్యోతి ఫౌండేషన్ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు.

సమాజంలో మాట్లాడలేని మూగజీవాల పట్ల దయ, కరుణ చూపుతూ వాటి సంక్షేమం కోసం కృషి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా మరింత మంది యువతలో సేవా స్ఫూర్తి పెంపొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జీవజ్యోతి ఫౌండేషన్ భవిష్యత్తులో చేపట్టే సేవా కార్యక్రమాలకు తన వంతుగా పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జీవజ్యోతి ఫౌండేషన్ సభ్యులు అనిల్, కొండ గణేష్, దమ్మపాల్, బుట్టి శివ, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నరూ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE