e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

బోనాల జాతరకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు ఆహ్వానం

బోనాల జాతరకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు ఆహ్వానం

కూచులాపూర్ శ్రీ అడెల్లి పోచమ్మ బోనాల జాతరకు హాజరుకావాలని ఆహ్వానించిన సర్పంచ్ మోడేపు వెంకన్న

మన భారత్, తలమడుగు: నవంబర్ 20, తలమడుగు మండలం కూచులాపూర్ గ్రామంలో నిర్వహించనున్న శ్రీ అడెల్లి పోచమ్మ బోనాల జాతరకు హాజరుకావాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను గ్రామ సర్పంచ్ మోడేపు వెంకన్న ప్రత్యేకంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కలిసి బోనాల జాతర ఆహ్వాన పత్రికను అందజేసి, ఉత్సవాలకు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్న ఈ జాతరలో గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.

శ్రీ దేవర మల్లయ్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ బోనాల జాతరలో భాగంగా ఉదయం 9 గంటలకు కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. గ్రామ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిర్వహించే ఈ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఆహ్వాన కార్యక్రమంలో కూచులాపూర్ సర్పంచ్ మోడేపు వెంకన్నతో పాటు గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE