e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

పుస్తక పఠనంతోనే విజ్ఞానం.. విద్యార్థుల్లో చదివే అలవాటును పెంపొందించాలి

పుస్తక పఠనంతోనే విజ్ఞానం.. విద్యార్థుల్లో చదివే అలవాటును పెంపొందించాలి

59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 20,

విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు విజ్ఞానాన్ని విస్తరించేందుకు గ్రంథాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నేతాజీ చౌక్ వద్ద ఉన్న జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకల్లో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్యతో కలిసి శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ముగింపు వేడుకలను ప్రారంభించారు.

అనంతరం వారోత్సవాల సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను అతిథులు ఆసక్తిగా తిలకించారు. విద్యార్థుల ప్రదర్శనలను అభినందించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ, పుస్తక పఠనం ద్వారా కొత్త విషయాలను తెలుసుకోవాలని, విద్యతో పాటు సామాజిక అవగాహనను పెంపొందించుకోవాలని అతిథులు సూచించారు. గ్రంథాలయాలను విద్యార్థులు, యువత సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మహబూబ్, మంగేష్ దేవతడే, జిల్లా కాంగ్రెస్ కార్యాలయ ఇన్‌చార్జి గౌలి సంజీవ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పసుల చంటి, సోనాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పోతన్న, 14వ వార్డు ప్రెసిడెంట్ జాదవ్ రాదేశ్యామ్, బెజ్జంకి అనిల్, కౌడాల సంతోష్, సుదర్శన్, గ్రంథాలయ సంస్థ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE