e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

ప్రతి లబ్ధిదారునికి రూ.4 వేల పెన్షన్ దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ అందించాలి – బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా పెన్షన్లు పెంచి హామీ నిలబెట్టుకోవాలి

ప్రతి లబ్ధిదారునికి రూ.4 వేల పెన్షన్, దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ అందించాలి – బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

మన భారత్, గుడిహత్నూర్:నవంబర్ 16,

పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆసరా పెన్షన్లను పెంచి లబ్ధిదారులకు అందించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. ప్రతి పెన్షన్ లబ్ధిదారునికి నెలకు రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000 చొప్పున పెన్షన్ చెల్లించి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ రోజు గుడిహత్నూర్ మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో నిర్వహించిన ఆసరా పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలను పంపిణీ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ప్రభుత్వం అందించే పెన్షన్ ఎంతో కీలకమైన ఆర్థిక ఆధారంగా నిలుస్తోందని పేర్కొన్నారు.

ప్రస్తుత ధరల పెరుగుదలకు అనుగుణంగా పెన్షన్ మొత్తాన్ని పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి పెన్షన్ లబ్ధిదారునికి నెలకు రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000 చొప్పున అందించాలని డిమాండ్ చేశారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని, పెన్షన్ల పెంపు విషయంలో జాప్యం చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పెన్షన్‌పై ఆధారపడి జీవిస్తున్న నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE