e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహణ అభినందనీయం: ఎమ్మెల్యే పాయల్ శంకర్

సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలి
ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహణ అభినందనీయం: ఎమ్మెల్యే పాయల్ శంకర్

మన భారత్, ఆదిలాబాద్:

యువత విద్య, ఉద్యోగాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. సమాజంలోని పేద, అవసరంలో ఉన్న ప్రజలకు సేవ చేయడం గొప్ప బాధ్యత అని, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని పుత్లీబౌలి షాదీఖానాలో న్యాయవాది అబ్దుల్ బషీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సందర్శించారు. ఈ సందర్భంగా శిబిరంలో వైద్యులతో మాట్లాడి పరీక్షల నిర్వహణ, రోగులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను తెలుసుకున్నారు.

ఈ శిబిరానికి వచ్చిన ప్రజలకు వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కళ్లద్దాలను ఉచితంగా అందజేశారు. కంటి సమస్యలు ఉన్నవారిని గుర్తించి, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయించేందుకు సహకారం అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అర్హత కలిగిన వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు. ముందస్తు పరీక్షలు, సరైన సమయంలో వైద్యం పొందడం ద్వారా కంటి చూపును కాపాడుకోవచ్చని తెలిపారు.

సామాజిక బాధ్యతతో న్యాయవాది అబ్దుల్ బషీర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. యువత ఇటువంటి సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని ప్రజా సంక్షేమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE