e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

కాలువలో పడిన గేదె.. స్లాబ్ లేక తరచూ ప్రమాదాలు!

ఆదిలాబాద్‌లో డ్రైనేజీ కాలువలో పడిన గేదె.. స్లాబ్ లేక తరచూ ప్రమాదాలు!

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 13,

ఆదిలాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో డ్రైనేజీ కాలువ ప్రమాదకరంగా మారింది. కాలనీలోని ఎంపీ గోడం నగేశ్ ఇంటి సమీపంలో ఉన్న డ్రైనేజీ కాలువలో ప్రమాదవశాత్తు ఓ గేదె పడిపోయి ఇరుక్కుపోయింది. దీంతో స్థానికంగా కలకలం నెలకొంది.

గేదె డ్రైనేజీలో పడిపోయిన విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని గేదెను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అయితే కాలువలో గేదె ఇరుక్కుపోవడం, సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు.

ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ.. డ్రైనేజీ కాలువపై స్లాబ్ లేకపోవడంతో ప్రజలు, పశువులు ప్రమాదాలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో కాలువలు కనిపించకపోవడంతో ప్రమాదాల ముప్పు మరింత ఎక్కువగా ఉంటోందని తెలిపారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని, అయినప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు.

ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువలో చిక్కుకున్న గేదెను బయటకు తీసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. అలాగే ప్రమాదాలకు కారణమవుతున్న తెరిచి ఉన్న డ్రైనేజీలపై స్లాబులు ఏర్పాటు చేసి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE