e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహాల్లో దీపాలు వెలిగించి సంబరాల్లో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మావలలో ఘనంగా ‘ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహాల్లో దీపాలు వెలిగించి సంబరాల్లో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మన భారత్, మావల: అక్టోబర్ 8:

ఆర్థికంగా వెనుకబడిన పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఇళ్లలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం మావల మండల కేంద్రంలో ‘ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమం సందడిగా సాగింది.

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు కారం స్వప్న, కలగట్టు మంజుల నివాసాలకు అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, మాజీ ఎంపీ సోయం బాపూరావు, డీసీసీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్‌లతో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. లబ్ధిదారుల ఇళ్లలో దీపాలు వెలిగించి, కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ పండుగ సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం పేద కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు చేపడుతున్న చర్యల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తమకు సొంత ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

పండుగ వేళ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు చేరుకుని వారితో కలిసి వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలతో పండుగ ఆనందాలను పంచుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వర్ రావు, గృహ నిర్మాణ శాఖ పీడీ శంకర్, ఏఈ నశీర్, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజ రెడ్డి, మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, ఉప సర్పంచ్ స్వప్న అడెల్లు, దేరా కృష్ణారెడ్డి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE