e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీరు.. పట్టించుకోని అధికారులు.?

నీటిని పొదుపు చేయాలని కలెక్టర్ సూచనలు..

క్షేత్రస్థాయిలో మాత్రం వృథా సమస్యపై పలుమార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదంటున్న స్థానికులు

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 5,

ప్రజలకు తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకం నీరు ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్ ప్రాంతంలో వృథాగా పోతుండటం స్థానికుల ఆందోళనకు కారణమవుతోంది. ఒకవైపు నీటి ప్రాధాన్యతను గుర్తించి ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచిస్తుండగా, మరోవైపు పైపులైన్ నుంచి నీరు బయటకు వచ్చి వృథాగా ప్రవహిస్తుండటంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

విద్యానగర్ ప్రాంతంలో మిషన్ భగీరథ పైపులైన్ నుంచి నీరు బయటకు వస్తున్న విషయంపై స్థానిక కౌన్సిలర్ కళల శ్రీనివాస్‌ను మన భారత్ స్టాఫ్ రిపోర్టర్ సంప్రదించగా, పైపులైన్‌లో ఎక్కడెక్కడ లీకేజీలు (హోల్స్) ఉన్నాయో గుర్తించేందుకే నీటిని వదిలినట్లు ఆయన సమాధానమిచ్చారు.

అయితే, అక్కడి స్థానికులు మాత్రం ఈ వివరణపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నీరు వృథాగా పోతున్న విషయాన్ని పలుమార్లు కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఫోన్ చేసినప్పటికీ స్పందన లేదని వారు ఆరోపిస్తున్నారు. తాగునీటి విలువ తెలిసిన ప్రజలకు ఇలా నీరు వృథా కావడం బాధాకరంగా ఉందని పేర్కొంటున్నారు.

ప్రజలకు నీటి పొదుపుపై అవగాహన కల్పించాల్సిన ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పైపులైన్ లీకేజీల నివారణపై కూడా తగిన శ్రద్ధ చూపాలని స్థానికులు కోరుతున్నారు. సంబంధిత మిషన్ భగీరథ అధికారులు వెంటనే స్పందించి లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని, నీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విద్యానగర్‌లో నీటి వృథాను అరికట్టి సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE