e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

ఫిర్యాదు అందిన మూడు గంటల్లోనే బాలుడి ఆచూకీ.. క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగింత

మావల పోలీసుల వేగవంతమైన స్పందన – సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు

మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 02:

తల్లి మందలించిందనే మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన 11 ఏళ్ల బాలుడిని మావల పోలీసులు కేవలం మూడు గంటల్లోనే గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ, ప్రత్యేక బృందాలతో పోలీసులు చేపట్టిన గాలింపు చర్యలు ఫలించడంతో బాలుడి ఆచూకీ త్వరగా లభించింది.

వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ పట్టణంలోని షాద్నగర్ ప్రాంతానికి చెందిన సమరిన్ బేగంకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో 11 ఏళ్ల కుమారుడు పెద్దవాడు. అతను ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నాడు. నవంబర్ 2వ తేదీ ఉదయం తల్లి పని నిమిత్తం బయటకు వెళ్లే సమయంలో అక్కతో జరిగిన గొడవ విషయమై బాలుడిని మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

బాలుడు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లి షాద్నగర్ ప్రాంతంలో నిర్వహిస్తున్న పోలీసు మీకోసం కార్యక్రమంలో మావల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న వెంటనే మావల సీఐ బి.డి. ప్రేమ్ కుమార్ స్పందించి బాలుడి ఆచూకీ కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.

పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. మూడు బృందాలు సమన్వయంతో పనిచేయడంతో ఫిర్యాదు అందిన మూడు గంటల్లోపే బాలుడి ఆచూకీని గుర్తించారు. అనంతరం బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.

పోలీసుల తక్షణ స్పందన, ప్రత్యేక బృందాల సమన్వయం, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బాలుడిని త్వరగా గుర్తించిన తీరుపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మావల పోలీసులను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా జిల్లా పోలీసు శాఖ తల్లిదండ్రులకు సూచనలు చేస్తూ.. పిల్లలు చిన్నపాటి విషయాలకే మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిపోకుండా వారితో ప్రేమగా మాట్లాడాలని, వారి సమస్యలను ఓపికగా తెలుసుకోవాలని పేర్కొంది. పిల్లలు కనిపించకుండా పోయిన సందర్భాల్లో ఆలస్యం చేయకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించింది. ప్రతి ఫిర్యాదుపై పోలీసులు తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు చేపడతారని వెల్లడించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE