e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, November 25, 2026

తలమడుగును కరువు మండలంగా ప్రకటించాలి.. నిర్లక్ష్యంపై కేటీఆర్ ఆగ్రహం

మన భారత్, తలమడుగు: జిల్లాలోని 20 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి తలమడుగు మండలాన్ని విస్మరించడం అన్యాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తలమడుగు మండలంపై ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చూపుతోందని ప్రశ్నించారు.

మండల కేంద్రంలోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఆయన నిలదీశారు. వ్యవసాయంపై ఆధారపడిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తలమడుగు మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెలుగు రాజన్న, మండల నాయకులు, సీనియర్ నేతలు, వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు, యువత, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE