e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దు.. ధైర్యంగా ఉండండి – ఆదిలాబాద్ రైతు గర్జన వేదికగా విజ్ఞప్తి

రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దు.. ధైర్యంగా ఉండండి – ఆదిలాబాద్ రైతు గర్జన వేదికగా విజ్ఞప్తి

మన భారత్, ఆదిలాబాద్ : నవంబరు 1, రైతులు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ధైర్యంగా ఉండి సమస్యలను ఎదుర్కోవాలని ఆదిలాబాద్ రైతు గర్జన సభ వేదికగా రైతులకు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. వ్యవసాయంలో ఎదురయ్యే నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతల కారణంగా మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకోవద్దని కోరారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రతి రైతు కుటుంబానికి అండగా నిలవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని భరోసా వ్యక్తం చేశారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ధైర్యంగా ఉండాలని, కష్టకాలంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజంలోని వారు రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

ముఖ్యంగా బోథ్ నియోజకవర్గ పరిధిలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరామర్శించి, ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

రైతు కుటుంబాల బాధలను గుర్తించి వారికి భరోసా కల్పించడం అవసరమని పేర్కొంటూ, రైతులెవరూ ఒంటరిగా ఉన్నామని భావించవద్దని, సమస్యలు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు, అధికారులను సంప్రదించాలని సూచించారు. రైతుల ప్రాణాలు అమూల్యమైనవని, ప్రతి రైతు కుటుంబానికి సమాజం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE