e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

ఖోడద్‌లో నూతన బస్ షెల్టర్ ప్రారంభించిన కేటీఆర్

ఖోడద్‌లో నూతన బస్ షెల్టర్ ప్రారంభించిన కేటీఆర్
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి

 మన భారత్, తలమడుగు: అక్టోబర్ 1, తలమడుగు మండలం ఖోడద్ గ్రామంలో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన నూతన బస్ షెల్టర్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఎముల శివారెడ్డి జ్ఞాపకార్థం రూ.3.50 లక్షల వ్యయంతో ఈ బస్ షెల్టర్‌ను నిర్మించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గ్రామంలో బస్ షెల్టర్ నిర్మాణం చేపట్టడం అభినందనీయమని, ఇందుకు కృషి చేసిన స్థానిక సర్పంచ్‌ను అభినందించారు. గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా చొరవ చూపాలని అన్నారు.

నూతన బస్ షెల్టర్ అందుబాటులోకి రావడంతో బస్సుల కోసం ఎదురుచూసే ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎండ, వర్షం వంటి వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణ లభించడంతో పాటు ప్రయాణికుల నిరీక్షణ మరింత సౌకర్యవంతంగా మారుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఖోడద్ గ్రామ సర్పంచ్ ఎముల ప్రియాంక రెడ్డి, లక్ష్మారెడ్డి, మండల నాయకులు, సీనియర్ నాయకులు, గ్రామస్తులు, యువత, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE