e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, November 26, 2026

ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలి

ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి
ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన యోధుల చరిత్రను ప్రతి గ్రామంలో చాటిచెప్పాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 1, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూనే వాటి విశిష్టతను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన కుమ్రం సూరు విగ్రహాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రెవెన్యూ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దండారి బృందం ప్రదర్శించిన ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాకారులు తమ నృత్య ప్రదర్శనలతో సభకు వచ్చిన వారిని అలరించారు.

సమావేశంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ఆదివాసీ సమాజం తన మూలాలను, సంస్కృతి సంప్రదాయాలను మరచిపోకుండా వాటిని రాబోయే తరాలకు పరిచయం చేయాలని సూచించారు. ఆదివాసీ హక్కులు, ప్రత్యేక గుర్తింపు, చట్టాల సాధన కోసం పోరాటం చేసిన మహనీయుల చరిత్రను యువతకు తెలియజేయాలన్నారు. వారి త్యాగాలు, పోరాట స్ఫూర్తిని గుర్తుచేసేలా గ్రామగ్రామాన ఆదివాసీ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

యువత గంజాయి సాగు, మాదకద్రవ్యాలు, ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. గంజాయి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు, స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని కోరారు. ఈ దిశగా ఆదివాసీ కుటుంబాలకు తన వంతుగా పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. గంజాయి సాగు చేయని వారిపై అన్యాయంగా పోలీసులు కేసులు నమోదు చేస్తే బాధితులకు అండగా నిలుస్తానని తెలిపారు.

కుమ్రం సూరు విగ్రహ ఏర్పాటుపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ వాటిని పట్టించుకోకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించుకోవడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆదివాసీ సమాజానికి తమ చరిత్ర, సంస్కృతి పట్ల గౌరవం ఉండాలని, వాటి పరిరక్షణకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కొలం నేవా సంఘం రాష్ట్ర నాయకుడు కొడప సోనేరావు, జిల్లా అధ్యక్షుడు మాడవి గోవింద్ రావు, కుమ్ర జంగు, కొడప భీంరావు, మాడవి జలీంరావు, మేస్రం భాస్కర్, గేడం కేశవ్, కుమ్ర రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE