e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

వైభవంగా బతుకమ్మ నిమజ్జన వేడుకలు..

దేవాపూర్‌లో వైభవంగా బతుకమ్మ నిమజ్జన వేడుకలు
పూల పండుగలో పాల్గొన్న మహిళలు, యువత.. సంప్రదాయబద్ధంగా గంగమ్మ ఒడికి బతుకమ్మలు

మన భారత్, తలమడుగు: అక్టోబర్ 31, తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో బతుకమ్మ నిమజ్జన వేడుకలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ముగింపు సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మలను భాజాభజంత్రీలు, పాటలు, నృత్యాల నడుమ గ్రామంలో ఊరేగించారు. మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు.

అనంతరం గ్రామంలోని గంగమ్మ ఒడికి చేరుకొని సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంతో గ్రామంలో పండుగ సందడి నెలకొంది. చిన్నారులు, యువత, మహిళలు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్, కిరణ్ తథాజీతో పాటు మహిళలు, చిన్నారులు, యువత, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE