e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

నేడు దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేయాలి.. ఆదివాసీ సంఘాల నాయకుల పిలుపు

కొమురం భీమ్ విగ్రహ ఆవిష్కరణకు సహకరించండి
నవంబర్ 1న బజార్ హత్నూర్‌లో దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేయాలి
ఆదివాసీ సంఘాల నాయకుల పిలుపు

మన భారత్, బజార్ హత్నూర్:,31, ఆదివాసీ వీరుడు, జల్–జంగల్–జమీన్ నినాదంతో గిరిజన హక్కుల కోసం పోరాడిన కొమురం భీమ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నవంబర్ 1న బజార్ హత్నూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గ్రామంలోని చిరు వ్యాపారులు, దుకాణదారులు, కార్మికులు, వ్యాపారస్తులు సహకరించాలని తొమ్మిది తెగల ఆదివాసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా నవంబర్ 1వ తేదీన గ్రామంలోని వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. కొమురం భీమ్ ఆశయాలు, ఆదివాసీ సమాజ హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

తొమ్మిది తెగల ఆదివాసీ సంఘాలన్నీ ఐక్యంగా ముందుకు వచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని, ఆదివాసీల ఐక్యత, సాంస్కృతిక వారసత్వం, సంఘటిత శక్తిని చాటాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజలు, యువత, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు సహకరించి కొమురం భీమ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE