e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, November 25, 2026

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి..

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ‘యూనిటీ డే’ కార్యక్రమం

మన భారత్, తాంసి. అక్టోబర్ 31, భారతదేశ తొలి ఉప ప్రధాని, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని తాంసి మండలంలోని మై భారత్ కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ‘యూనిటీ డే’ (జాతీయ ఐక్యతా దినోత్సవం) కార్యక్రమాన్ని నిర్వహించి సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించుకున్నారు.

కార్యక్రమంలో విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. ఉదయ భాస్కర్ మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యత, సమగ్రత కోసం చేసిన కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత లక్ష్యాల వైపు ముందుకు సాగాలని సూచించారు.

అనంతరం ప్రభుత్వంనుంచి విద్యార్థులకు అందిన యూనిఫామ్‌లను గ్రామ సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఏజీఎం శ్రీ శశికుమార్, ఇంగ్లీష్ అధ్యాపకులు, రాజేందర్, మీండ్గర, వాలంటీర్లు, చందు, కంభం రాజు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే ఎంఈఓ భగవంతులు, క్లస్టర్ కో-ఆర్డినేటర్ మురేందర్, కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. ఉదయ భాస్కర్‌తో పాటు కళాశాల బోధన సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE