e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

ఢిల్లీకి చేరుకున్న ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతలు.. హైకమాండ్‌తో కీలక భేటీకి రంగం సిద్ధం!

ఢిల్లీకి చేరుకున్న ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతలు.. హైకమాండ్‌తో కీలక భేటీకి రంగం సిద్ధం!

పార్టీ సంస్థాగత బలోపేతం, స్థానిక రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చలు

**మన భారత్, ఆదిలాబాద్, అక్టోబర్ 31:** ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుల ప్రతినిధి బృందం ఢిల్లీకి చేరుకుంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పార్టీ రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధిష్టానంతో చర్చించేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు సమాచారం.

ఈ పర్యటనలో మాజీ ఎంపీ స్వయం బాబు రావు, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నరేష్ యాదవ్, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, నిర్మల్ జిల్లా మైనారిటీ అధ్యక్షుడు, డీసీసీ ప్రధాన కార్యదర్శి జునైద్ మెమన్, మున్సిపల్ కౌన్సిలర్ ఇమ్రానుల్లా, మైనారిటీ టౌన్ అధ్యక్షుడు మతీన్, డీసీసీ కార్యదర్శి ఖిజర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న నాయకులకు పార్టీ వర్గాల నుంచి స్వాగతం లభించింది. అనంతరం పార్టీ కేంద్ర నాయకత్వంలోని ముఖ్య నేతలను కలిసి ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది.

ఈ సమావేశాల్లో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణం, స్థానిక ప్రజా సమస్యలు, రానున్న రోజుల్లో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను సంస్థాగతంగా మరింత పెంచుకునే అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

జిల్లా స్థాయి నాయకులు నేరుగా ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో సంప్రదింపులు జరపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటన అనంతరం జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై అధిష్టానం ఎలాంటి దిశానిర్దేశం చేస్తుందో అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE