వైభవంగా గోవిందా స్వామి రథయాత్ర..
గోవింద నామస్మరణతో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం రథయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 30, ఆదిలాబాద్ పట్టణంలోని శాస్త్రి మందిరం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని శుక్రవారం రాత్రి భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, భక్తుల గోవింద నామస్మరణతో పట్టణ పురవీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రథోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వేద పండితులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ...