e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల నిరసన..

మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల నల్లబ్యాడ్జీల నిరసన
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని MS-JAC డిమాండ్
మన భారత్ చిట్యాల: (జయశంకర్ భూపాలపల్లి జిల్లా): తెలంగాణ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ MS-JAC రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా శుక్రవారం చిట్యాల TGMS పాఠశాలలో భోజన విరామ సమయంలో MS-JAC స్టీరింగ్ కమిటీ సభ్యుడు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. మోడల్ స్కూల్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రధానంగా 010 పాఠశాలల విలీనం, ప్రమోషన్లు, కొత్త నియామకాలు, CPS నిధుల సెటిల్మెంట్, డీఏ బకాయిల చెల్లింపు, TGTలకు నోషనల్ సర్వీస్, హెల్త్ కార్డుల మంజూరు, అవర్‌లీ బేసిస్ ఉపాధ్యాయుల వేతనాల పెంపు వంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.అలాగే ఒకేషనల్ ట్రైనర్లకు కనీస టైమ్ స్కేల్ అమలు చేయడంతోపాటు, వేతనాలను సకాలంలో చెల్లించాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.ఉద్యోగుల ఐక్యతే బలం.. సమస్యల పరిష్కారమే లక్ష్యం అంటూ ఉపాధ్యాయులు నినదించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE