e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

తలమడుగును కరువు మండలంగా ప్రకటించాలి..

మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి, పంట నష్టాలతో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు బోథ్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆడే గజేందర్‌తో కలిసి మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి తదితర నాయకులు జిల్లా కలెక్టర్‌ రాజర్షి షాను కలిసి వినతిపత్రం అందజేశారు.

జిల్లాలోని పలు మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ తలమడుగు మండలాన్ని జాబితాలో చేర్చకపోవడం రైతులకు అన్యాయం చేయడమేనని నాయకులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. మండలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటల దిగుబడులు గణనీయంగా తగ్గాయని, సాగు పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితుల్లో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.

తలమడుగు మండలంలోని క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కరువు మండలంగా గుర్తించాలని వారు కోరారు. రైతుల పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదికలు పంపించి, న్యాయం జరిగేలా తనవంతు ప్రయత్నం చేస్తానని కలెక్టర్‌ రాజర్షి షా హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కే. ప్రతాప్, మాజీ జెడ్పీటీసీ బి. బాబన్న, మాజీ ఎంపీపీ కే. లక్ష్మి రాజేశ్వర్, నాయకులు ఈ. ప్రకాష్ రావు, జి. వెంకన్న, సి. రమేష్ రెడ్డి, ఎల్. ప్రవీణ్ రెడ్డి, జి. సాంబశివ్, సర్పంచులు నగేష్, కే. వెంకటేష్, మార్కెట్ డైరెక్టర్ ఎం. పోశెట్టి, యూత్ కాంగ్రెస్ నాయకుడు సాయి కిరణ్, ఎస్సీ సెల్ నాయకుడు రాజేశ్వర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE