తలమడుగును కరువు మండలంగా ప్రకటించాలి..
మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి, పంట నష్టాలతో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు బోథ్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆడే గజేందర్‌తో కలిసి మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి తదితర నాయకులు జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని పలు మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ తలమడుగు మండలాన్ని జాబితాలో చేర్చకపోవడం రైతులకు అన్యాయం చేయడమేనని...