e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, October 26, 2026

SERP సీఈఓ దివ్య దేవరాజన్ పర్యటన..

ఆసిఫాబాద్ జిల్లాలో SERP సీఈఓ దివ్య దేవరాజన్ పర్యటన

ఆసిఫాబాద్ జిల్లా, అక్టోబర్ 26: రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) సీఈఓ దివ్య దేవరాజన్ రెండు రోజుల పాటు ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. అక్టోబర్ 26, 27 తేదీల్లో జిల్లాలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలను ఆమె పరిశీలించనున్నారు.

పర్యటనలో భాగంగా అక్టోబర్ 26న లింగాపూర్ మండలంలోని ములుగుడ, కంచన్‌పల్లి గ్రామాల్లో నిర్వహించే TGILP (Telangana Green and Livelihood Improvement Programme) కార్యక్రమాల్లో SERP సీఈఓ పాల్గొంటారు. గ్రామీణ జీవనోపాధుల మెరుగుదల, పేద కుటుంబాలకు అందుతున్న కార్యక్రమాల అమలు తీరును పరిశీలించనున్నారు.

అక్టోబర్ 27న తిర్యాణి మండలంలోని సుంగాపూర్, కొలంగూడ, గుడిపేటతో పాటు తిర్యాణి ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా WASSAN ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్యకలాపాలను పరిశీలించనున్నారు. అనంతరం తిర్యాణిలోని మహిళా శక్తి క్యాంటీన్‌ను సందర్శించి దాని నిర్వహణ, మహిళలకు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలు, కార్యకలాపాల పురోగతిని పరిశీలించనున్నారు.

రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయా ప్రాంతాల్లో అమలవుతున్న కార్యక్రమాల ప్రస్తుత పరిస్థితి, క్షేత్రస్థాయి అమలు, లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాలను పరిశీలించనున్నారు. పర్యటన ముగించుకుని అక్టోబర్ 27 సాయంత్రం హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE