e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 24, 2026

ఆదిలాబాద్ మార్కెట్‌లో పత్తికి రూ.9,200 ధర

ఆదిలాబాద్ మార్కెట్‌లో పత్తికి రూ.9,200 ధర

ఇతర ప్రధాన మార్కెట్ల కంటే మెరుగైన ధర.. రైతులకు నేరుగా మార్కెట్‌కు పత్తి తీసుకురావాలని సూచన

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 24, పత్తి కొనుగోళ్లలో ఆదిలాబాద్ మార్కెట్‌లో రైతులకు మెరుగైన ధర లభిస్తోంది. మూడవ రోజు కొనుగోళ్లలో ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్ పత్తికి గరిష్ఠంగా రూ.9,200 ధర చెల్లించినట్లు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా మార్కెట్ కార్యాలయంలోని నోటీస్ బోర్డుపై రాష్ట్రంలోని పలు ప్రధాన మార్కెట్లలో నమోదైన పత్తి ధరల వివరాలను అధికారులు ప్రకటించారు. మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లకు సంబంధించిన ధరల వివరాలను రైతులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

ఆదిలాబాద్ మార్కెట్‌లో ప్రైవేట్ కొనుగోళ్ల ద్వారా క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.9,200 ధర నమోదైంది. అదే సమయంలో సీసీఐ కొనుగోళ్లలో రూ.8,667 ధర కొనసాగుతున్నట్లు మార్కెట్ కమిటీ వివరించింది.

రాష్ట్రంలోని ఇతర ప్రధాన మార్కెట్ల ధరలను పరిశీలిస్తే వరంగల్ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.9,010, జమ్మికుంట మార్కెట్‌లో రూ.9,170, ఖమ్మం మార్కెట్‌లో రూ.9,100 ధరలు నమోదైనట్లు తెలిపారు. ఈ ధరలతో పోలిస్తే ఆదిలాబాద్ మార్కెట్‌లో ప్రైవేట్ కొనుగోళ్ల ధర రూ.9,200గా ఉండటం గమనార్హం.

రైతులు పత్తిని మార్కెట్‌కు తీసుకువచ్చే ముందు నాణ్యత, తేమ తదితర అంశాలపై దృష్టి సారించాలని మార్కెట్ అధికారులు సూచిస్తున్నారు. దళారులపై ఆధారపడకుండా మార్కెట్ యార్డులోనే పత్తిని విక్రయించడం ద్వారా అందుబాటులో ఉన్న ధరలను తెలుసుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

పత్తి కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరిగేలా మార్కెట్ అధికారులు, కొనుగోలుదారులు, కమీషన్ ఏజెంట్లు సమన్వయంతో పనిచేస్తున్నారని చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతులకు మెరుగైన ధరలు అందేలా మార్కెట్‌లో కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్, సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ విట్టల్, మార్కెట్ సూపర్‌వైజర్ స్వామితో పాటు వివిధ శాఖల అధికారులు, కమీషన్ ఏజెంట్లు, కొనుగోలుదారులు, రైతులు పాల్గొనారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE