e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, November 28, 2026

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

ధన్నూర్‌లో సాయిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

ఇదాపు సెంటెమ్మ మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపిన తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు

మన భారత్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని బోథ్ మండలం ధన్నూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు సాయిరెడ్డి మాతృమూర్తి ఇదాపు సెంటెమ్మ ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మంగళవారం సాయిరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా సెంటెమ్మ మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మాతృమూర్తిని కోల్పోవడం బాధాకరమని, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని ఆయన పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ జగన్ రెడ్డి, మాజీ సర్పంచ్ కొండయ్య, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సంజీవ్ రెడ్డి, అభిమన్యు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని సాయిరెడ్డి కుటుంబానికి సానుభూతి తెలిపారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE