e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు..

మన భారత్, చిట్యాల:  మండలంలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన బిజెపి గ్రామ కమిటీ అధ్యక్షుడు సహా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పలువురు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.వారంతా బుధవారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో బిజెపి గ్రామ కమిటీ అధ్యక్షుడు గోపగాని స్వామి, నాయకులు కంచర్ల శ్రీనివాస్, గోలకొండ విజేందర్, బిఆర్ఎస్ పార్టీమాజీ గ్రామ కమిటీ అధ్యక్షుడు, ప్రస్తుత ఉపాధ్యక్షుడు గోపగాని శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోపగాని శివరాములు, బిఆర్ఎస్ ఎస్సీ సెల్ నాయకులు ఎలగొండ శంకర్, చెన్నమల్ల మొగిలి, బీసీ సెల్ నాయకులు ఆరెల్లి సంతోష్, అనుముల రవి, గజ్జి నరేష్, తదితరులున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ ల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులకు స్వాగతం పలుకుతూ సాదరంగా ఆహ్వానించారు. ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీకి, పటిష్టంగా పునాదులు వేయాలన్నారు. కష్టపడే వారికి కాంగ్రెస్ పార్టీ లో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దబ్బెట అనిల్,మాజీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి ,గ్రామ కమిటీ అధ్యక్షుడు గజ్జి రవి, సర్పంచ్ జన్నే సురేష్, వార్డు సభ్యుడు కంచు బిక్షపతి, యూత్ అధ్యక్షుడు కంచర్ల రాంబాబు, మురహరి బాను చందర్, చేన్న నిశాంత్, బాలుగ నీలేష్, గోపగాని వెంకటేశ్వర్లు, గోపగాని శివ, నీరటి నారాయణ, నాగిరెడ్డి శంకర్, గోనె కొమురయ్య, గోలకొండ పైడయ్య, నాయకులు, కోర్రీ అశోక్, అంగడి రాయమల్లు, తదితరులు పాల్గొన్నారు.

మీ శీలపాక రాజు మన భారత్ రిపోర్టర్ చిట్యాల 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE