e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది..

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

‘బాణం’ గుర్తుకు ఓటేసి మొగుళ్ల రాజిరెడ్డిని గెలిపించాలి: నరేష్ జాదవ్, బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మన భారత్, అక్టోబర్ 5, ఆదిలాబాద్:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ఇస్తున్న అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డిని ‘బాణం’ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కార్మికులను కోరారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని TGSRTC డిపో వద్ద ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మద్దతుతో బరిలో ఉన్న INTUC, SWU, TMU, SWF కూటమి అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డి తరఫున ప్రచార సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్‌తో పాటు ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జీలు కంది శ్రీనివాస్ రెడ్డి, ఆడే గజేందర్ పాల్గొన్నారు.

కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత

ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్ల పాలనలో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. రాత్రింబగళ్లు విధులు నిర్వహిస్తూ ప్రజలకు రవాణా సేవలు అందించే కార్మికులకు వేతనాలు సకాలంలో అందక అనేక అవస్థలు పడ్డారని పేర్కొన్నారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులు, కార్మికులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.

ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి కృషి

ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వం ఇప్పటికే పరిష్కరించిందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ విలీనంతో పాటు కార్మికుల మిగిలిన న్యాయమైన డిమాండ్లను కూడా దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.

కార్మికుల హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత, ఆర్టీసీ సంస్థ అభివృద్ధి కోసం కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న మొగుళ్ల రాజిరెడ్డికి కార్మికులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ‘బాణం’ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఘనంగా ప్రచార సభ

ప్రచార సభలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్, బోథ్ మార్కెట్ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, ఆత్మ కమిటీ చైర్మన్లు గిమ్మ సంతోష్, రాజు యాదవ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కిజార్ పాషా, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు ఆసిఫ్ ఖాన్, INTUC జిల్లా అధ్యక్షులు మునిగేల నర్సింగ్ పాల్గొన్నారు.

అలాగే బండి దేవిదాస్ చారి, బెజ్జంకి అనిల్ కుమార్, గౌలి సంజీవ్ కుమార్, కృష్ణారెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు, కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో TGSRTC ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. సభ సందర్భంగా కాంగ్రెస్ మద్దతు అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డికి మద్దతుగా నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE