e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

బ్యాంక్ అధికారులమంటూ సైబర్ మోసం.. నిందితుడి అరెస్ట్

క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో ఆదిలాబాద్ వ్యక్తికి రూ.73,279 టోకరా

మూడు రాష్ట్రాల్లో 150 ఫిర్యాదులు.. రూ.95.33 లక్షల మేర మోసాలకు పాల్పడినట్లు పోలీసుల గుర్తింపు

మన భారత్, ఆదిలాబాద్, అక్టోబర్ 5:
బ్యాంక్ అధికారులమంటూ ప్రజలకు ఫోన్ చేసి క్రెడిట్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలు సేకరించి సైబర్ మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు మహారాష్ట్రలో అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి టయోటా హైరైడర్ కారు, రెండు మొబైల్ ఫోన్లు, వివిధ సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ తెలిపారు.

ఆదిలాబాద్‌లో నిర్వహించిన పత్రికా సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడి మోసాల వ్యవహారం పలు రాష్ట్రాలకు విస్తరించినట్లు గుర్తించారు.

క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో రూ.73,279 మోసం

ఆదిలాబాద్ బ్రాహ్మణవాడకు చెందిన ప్రఫుల్ పాటిల్ కు 2026 జూలైలో బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పిన నిందితుడు.. క్రెడిట్ కార్డును యాక్టివేట్ చేస్తామని నమ్మించాడు. అనంతరం కార్డు వివరాలు, ఓటీపీలు తెలుసుకుని ఐదు లావాదేవీల ద్వారా బాధితుడి ఖాతా నుంచి మొత్తం రూ.73,279 బదిలీ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

దీనిపై బాధితుడు ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో Crime No.633/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

NCRP సాంకేతిక ఆధారాలతో నిందితుడి గుర్తింపు

దర్యాప్తులో భాగంగా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) ద్వారా లభించిన సాంకేతిక ఆధారాలను పోలీసులు విశ్లేషించారు. వాటి ఆధారంగా నిందితుడిని గుర్తించి, పై అధికారుల ఆదేశాల మేరకు ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసుల ప్రత్యేక బృందం మహారాష్ట్రకు వెళ్లింది. అక్కడ నిందితుడిని అదుపులోకి తీసుకుని ఆదిలాబాద్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.

అరెస్టయిన నిందితుడిని చైతన్య ప్రమోద్ కుటె (25)గా పోలీసులు గుర్తించారు. మహారాష్ట్రలోని అకోలా జిల్లా ప్రాంతానికి చెందిన అతను ప్రస్తుతం పింప్రి-చించ్వాడ్, పూణేలో ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.

బ్యాంకులో పనిచేసిన అనుభవంతో మోసాలు

పోలీసుల విచారణలో నిందితుడు గతంలో Axis బ్యాంక్‌లో పనిచేసిన అనుభవాన్ని సైబర్ మోసాలకు ఉపయోగించినట్లు వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు. బ్యాంక్ కస్టమర్లతో మాట్లాడిన అనుభవం ఆధారంగా మొబైల్ నంబర్లను సేకరించి, అనంతరం వివిధ సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లను మార్చుకుంటూ బ్యాంక్ అధికారుల పేరుతో కస్టమర్లకు ఫోన్ చేసేవాడని తెలిపారు.

క్రెడిట్ కార్డు యాక్టివేషన్, బ్యాంక్ ఖాతా సంబంధిత సమస్యలు ఉన్నాయంటూ నమ్మించి.. కార్డు వివరాలు, బ్యాంక్ ఖాతా సమాచారం, ఓటీపీలు తెలుసుకుని డబ్బులను వివిధ UPI, Amazon ఖాతాలకు బదిలీ చేసుకున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు.

మూడు రాష్ట్రాల్లో 150 ఫిర్యాదులు

నిందితుడిపై తెలంగాణ, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో సుమారు 150 మంది బాధితులు జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదులు నమోదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఫిర్యాదుల ప్రకారం సుమారు రూ.95,33,651 మేర ఆర్థిక మోసం జరిగినట్లు ఎస్పీ తెలిపారు.

సైబర్ మోసాలకు ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేసినట్లు కూడా నిందితుడు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. వివిధ మొబైల్ నంబర్లు, సిమ్ కార్డులు, ఫోన్లు మార్చుకుంటూ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.

నిందితుడి వద్ద నుంచి స్వాధీనం

పోలీసులు నిందితుడి వద్ద నుంచి Toyota Hyryder కారు (MH-14-MC-1167), Apple iPhone 13, Moto G67 మొబైల్ ఫోన్లు, వివిధ సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. కేసు దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.

ఓటీపీ, పిన్, సీవీవీ వివరాలు చెప్పొద్దు

బ్యాంక్ అధికారులు, పోలీసు అధికారులు, ప్రభుత్వ సంస్థల పేరుతో వచ్చే అనుమానాస్పద ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ OTP, PIN, CVV, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలను ఫోన్ ద్వారా ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించారు.

సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. త్వరగా ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన నగదును నిలిపివేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్, ఎస్‌ఐలు గోపికృష్ణ, అశోక్, సైబర్ క్రైమ్ సిబ్బంది, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE