e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

🌱 పర్యావరణ పరిరక్షణకు మొక్క నాటిన MEO రాధాకృష్ణ రెడ్డి

భీంపూర్: శ్రీ విహాన్ పబ్లిక్ స్కూల్‌లో సోమవారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్క నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన MEO రాధాకృష్ణ రెడ్డి పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు.

 ఈ సందర్భంగా రాధాకృష్ణ రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థులు మొక్కలను నాటి వాటిని సంరక్షించే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు. మొక్కల పెంపకం ద్వారా పచ్చదనాన్ని పెంచడంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ఆలేటి రవీందర్ మౌనిక , ప్రిన్సిపాల్ విజయసారథి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో మరిన్ని మొక్కలను నాటి వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని పాఠశాల యాజమాన్యం తెలిపింది.

మీ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE