e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, October 13, 2026

ఆ గ్రామ సర్పంచ్ కు గ్రామస్తుల అభినందనలు..

[విద్యుత్ స్తంభం ఎక్కి వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్న సర్పంచ్ నారు లక్ష్మీ వెంకన్న

మన భారత్, తలమడుగు:

గ్రామంలో విద్యుత్ మెకానిక్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తాను చిన్ననాటి నుంచి నేర్చుకున్న విద్యుత్ పనులను స్వయంగా చేస్తూ సేవలందిస్తున్న ఆర్లీ గ్రామ సర్పంచ్ నారు లక్ష్మీ వెంకన్నను గ్రామస్తులు అభినందించారు.

తలమడుగు మండలంలోని ఆర్లీ గ్రామంలో దసరా పండుగ సందర్భంగా వీధి దీపాల ఏర్పాటులో భాగంగా సర్పంచ్ నారు లక్ష్మీ వెంకన్న స్వయంగా విద్యుత్ పనులు చేపట్టారు. గ్రామంలో ఎలక్ట్రిక్ మెకానిక్ లేకపోవడంతో విద్యుత్ దీపాలు, ఇతర విద్యుత్ పరికరాల్లో సమస్యలు తలెత్తినప్పుడు గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. తాను చిన్నతనంలో నేర్చుకున్న ఎలక్ట్రిక్ వర్క్ ప్రస్తుతం గ్రామ ప్రజలకు ఉపయోగపడుతుండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గ్రామంలో విద్యుత్ పరికరాలు కాలిపోయినా, రిపేర్ అవసరమైనా ప్రజలు ఇబ్బంది పడకుండా తానే స్వయంగా వెళ్లి మరమ్మతులు చేస్తానని చెప్పారు. దసరా పండుగను పురస్కరించుకుని గ్రామంలోని వీధుల్లో అవసరమైన చోట విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రజలకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉంటూ సేవ చేయడమే తన లక్ష్యమని సర్పంచ్ పేర్కొన్నారు. సర్పంచ్ స్వయంగా విద్యుత్ పనులు చేపట్టి వీధి దీపాలను ఏర్పాటు చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి.

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE