e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

బాధితుడి కుటుంబాన్ని పరామర్శించిన AITUC

పౌరసరఫరాల శాఖ హమాలీ కార్మికుడు మహేష్ మృతి తీరని లోటు
బాధితుడి కుటుంబాన్ని పరామర్శించిన AITUC రాష్ట్ర ఉపాధ్యక్షులు S. విలాస్, నాయకులు

​బోథ్/నేరడిగొండ, అక్టోబరు 4 (మన భారత్):బోథ్ మండల కేంద్రంలోని సివిల్ సప్లై గోడౌన్‌లో హమాలీ కార్మికుడిగా సేవలు అందిస్తున్న జమ్మూరాజ్ మహేష్ (అనారోగ్యంతో శుక్రవారం మృతి) నివాసానికి శనివారం AITUC రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు చేరుకుని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
​ఈ సందర్భంగా AITUC రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ S. విలాస్ మాట్లాడుతూ… పౌరసరఫరాల శాఖ నిబంధనల ప్రకారం మహేష్ కుటుంబానికి అందాల్సిన ఎక్స్‌గ్రేషియా, ఇతర కార్మిక సంక్షేమ బెనిఫిట్లు త్వరగా దక్కేలా AITUC పూర్తిస్థాయిలో పోరాడుతుందని స్పష్టం చేశారు. కష్టకాలంలో ఉన్న ఈ కుటుంబానికి సంఘం ఎల్లవేళలా అండగా ఉంటుందని కొండంత అభయమిచ్చారు.
​అనంతరం AITUC ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కామ్రేడ్ భారతల గోవర్ధన్, కామ్రేడ్ సిర్ర దేవేందర్ మాట్లాడుతూ… మహేష్ మరణం స్థానిక కార్మిక ఉద్యమానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబానికి ఆధారంగా ఉన్న కార్మికుడిని కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన చెందారు.
​ఈ కార్యక్రమంలో AITUC సివిల్ సప్లై హమాలీ కార్మికులు SK హల్మత్, పల్లికొండ ఉష, అన్నగడ్డం లింగన్న, మోతె రవి, జుమ్మా రాత్, శైలేందర్, SK ముఖ్యం తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ గజ్జల పురుషోత్తం, మన భారత్ రిపోర్టర్, నేరడిగొండ.

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE