e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

మాన్యవర్‌ కాన్షీరాం 20వ వర్ధంతి వాల్‌పేపర్ల ఆవిష్కరణ..

మాన్యవర్‌ కాన్షీరాం 20వ వర్ధంతి సందర్భంగా వాల్‌పేపర్ల ఆవిష్కరణ

లకంపూర్‌లో ఘనంగా కార్యక్రమం.. బీఎస్పీ నాయకులు, గ్రామస్థుల పాల్గొనడం

మన భారత్, అక్టోబర్ 2 ,నేరడిగొండ: బహుజన ఉద్యమ నేత, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వ్యవస్థాపకుడు మాన్యవర్‌ కాన్షీరాం 20వ వర్ధంతిని పురస్కరించుకుని నేరడిగొండ మండలం లకంపూర్ గ్రామంలో ఆయన చిత్రాలతో రూపొందించిన వాల్‌పేపర్లను ఆవిష్కరించారు. కాన్షీరాం ఆశయాలు, బహుజన సమాజం కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి బీఎస్పీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ రత్నాపురం రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు ఆదిలాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు దుమ్మ శ్రీహరి, బోథ్ నియోజకవర్గ అధ్యక్షులు మొట్టే ప్రదీప్ పాల్గొన్నారు. నాయకులు కాన్షీరాం చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ.. దేశంలోని అణగారిన, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం మాన్యవర్‌ కాన్షీరాం చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. బహుజన వర్గాలను రాజకీయంగా, సామాజికంగా చైతన్యవంతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, హక్కుల సాధన కోసం కాన్షీరాం చూపిన మార్గాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.

కాన్షీరాం వర్ధంతి సందర్భంగా ఆయన ఆలోచనలు, ఉద్యమ ప్రస్థానాన్ని ప్రజలకు తెలియజేసేలా వాల్‌పేపర్లను ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. యువత సామాజిక చైతన్యంతో ముందుకు సాగాలని, రాజ్యాంగ విలువలు, సమానత్వం, సామాజిక న్యాయం వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు, లకంపూర్ గ్రామస్థులు, అభిమానులు తదితరులు పాల్గొని మాన్యవర్‌ కాన్షీరాంకు ఘన నివాళులు అర్పించారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE