e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

రాజ్యాంగ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి

 ఘనంగా పౌర హక్కుల దినోత్సవం

తలమడుగు, సెప్టెంబర్ 30 (మన భారత్): భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ తెలుసుకుని గౌరవించాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు అరెల్లి మల్లేష్, అయిండ్ల శశికాంత్ సూచించారు. తలమడుగు మండలం ఖోడద్ గ్రామంలో తహసీల్దార్ అధ్యక్షతన నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, గౌరవంతో జీవించే హక్కులను కల్పించిందన్నారు. హక్కులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు దేశం, సమాజం పట్ల ప్రతి ఒక్కరూ తమ ప్రాథమిక బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు.

ఎస్సీ, ఎస్టీ వర్గాలపై వివక్ష, అంటరానితనం, సామాజిక అణచివేత, అఘాయిత్యాలను నిరోధించేందుకు చట్టపరమైన రక్షణలు ఉన్నాయని తెలిపారు. బాధితులకు అందుబాటులో ఉన్న రక్షణ, పరిహారం, ఫిర్యాదు ప్రక్రియ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఏ చట్టాన్నీ దుర్వినియోగం చేయకుండా చట్టబద్ధమైన విధానాలను గౌరవించాలని సూచించారు.

కార్యక్రమంలో గ్రామస్థులు విద్య, వైద్యం, గృహాలు, మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలను కమిటీ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు.

కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, ఎస్‌ఐ, ఆర్‌ఐ, హాస్టల్ వెల్ఫేర్ అధికారి, అంగన్‌వాడీ టీచర్, ఆశా వర్కర్, పంచాయతీ సిబ్బంది, అధికారులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జ్ 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE