e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

టీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు..

బీఆర్‌ఎస్‌ నుంచి పలువురు నాయకులు, కార్యకర్తల చేరిక

నేరడిగొండ, సెప్టెంబర్ 30 (మన భారత్): బోథ్ నియోజకవర్గంలోని నేరడిగొండ మండలంలో పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్‌లో చేరారు. మాదాపూర్, గుత్పాల, నేరడిగొండ గ్రామాలకు చెందిన నాయకులు, యువకులు బుధవారం పార్టీలో చేరగా, మండల కన్వీనర్ బానోతు వసంత్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు, బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కొత్తగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు.

గ్రామాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. పార్టీ కార్యక్రమాలు, విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

మండల కన్వీనర్ బానోతు వసంత్ మాట్లాడుతూ నేరడిగొండ మండలంలో పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తూ అందరినీ కలుపుకుని ముందుకు సాగుతామని చెప్పారు.

కొత్తగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తామని, గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.

కార్యక్రమంలో మండల మైనార్టీ చైర్మన్ అయూబ్, ఆత్రం రఘునాథ్, సాంబాజీ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జ్ 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE