e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

నేడు మూడు మండలాలకు విద్యుత్ కోతలు..

నేడు తాంసి, భీంపూర్, తలమడుగులో విద్యుత్ సరఫరా నిలిపివేత

అర్లి(టీ) 33 కేవీ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా 2 గంటల పాటు అంతరాయం

మన భారత్, సెప్టెంబర్ 29 ,తలమడుగు: భీంపూర్ మండలం అర్లి(టీ) 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో చేపట్టనున్న మరమ్మతుల కారణంగా సెప్టెంబర్ 30న విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

మరమ్మతు పనుల దృష్ట్యా ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కారణంగా తాంసి, భీంపూర్, తలమడుగు మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది.

విద్యుత్ సబ్‌స్టేషన్‌లో అవసరమైన మరమ్మతు పనులను సురక్షితంగా, వేగంగా పూర్తి చేసేందుకు విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. వినియోగదారులు ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

మరమ్మతు పనులు పూర్తయిన అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు. విద్యుత్ శాఖ సిబ్బందికి వినియోగదారులు సహకరించాలని కోరారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి.

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE