e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ..

స్వరాష్ట్రం కోసం పదవులు, ఆస్తులను సైతం త్యాగం చేసిన మహానేత: ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మన భారత్, సెప్టెంబర్ 27 ,ఆదిలాబాద్: తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం జీవితాంతం కృషి చేసిన తెలంగాణవాది, స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ, ఆదిలాబాద్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్‌లతో కలిసి ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు సమాన రాజకీయ అవకాశాలు, సామాజిక న్యాయం అందాలనే ఆకాంక్షతో కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజా జీవితాన్ని కొనసాగించారని అన్నారు. ప్రజల హక్కుల కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు.

నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలకంగా పాల్గొన్నారని, క్విట్ ఇండియా ఉద్యమం, గైర్ ముల్కీ ఆందోళనతో పాటు తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన పోషించిన పాత్రను నేటి తరాలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ తన రాజకీయ పదవులు, ఆస్తులు సహా సర్వస్వాన్ని త్యాగం చేశారని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షల కోసం వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి పోరాడినందుకే ఆయనను ప్రజలు ఆప్యాయంగా ‘తెలంగాణ బాపూజీ’గా స్మరించుకుంటున్నారని అన్నారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల్లో సామాజిక సమానత్వం, ప్రజాస్వామ్య విలువలు, తెలంగాణ అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఉందని తెలిపారు. ఆయన చూపిన మార్గంలో ప్రజాసేవకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు. బాపూజీ ఆశయ సాధనకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి సోనియా, బీసీ సంఘం అధ్యక్షుడు చిక్కాల దత్తు, మంచికట్ల ఆశమ్మతో పాటు పలువురు పద్మశాలి సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE