e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి..

సమస్యలపై ఎమ్మెల్యేకు డీవైఎఫ్ఐ వినతి

మన భారత్, చిట్యాల: మండల కేంద్రంలోని సివిల్ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ డివైఎఫ్ఐ, వీసీకే సంఘాల ఆధ్వర్యంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గారికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చిట్యాల సివిల్ ఆస్పత్రికి చిట్యాల మండలంతో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు వైద్యం కోసం వస్తున్నారని తెలిపారు. అయితే ఆస్పత్రిలో తాగునీటి సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ఆస్పత్రిలో రోగులు, వారి సహాయకులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండేలా RO/వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయడంతో పాటు నిరంతర నీటి సరఫరా, వాటర్ ట్యాంక్ సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే ఆస్పత్రిలోని ఇతర మౌలిక సదుపాయాలను కూడా అధికారులు పరిశీలించి మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని నాయకులు అన్నారు. చిట్యాల సివిల్ ఆస్పత్రి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గారిని కోరినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో DYFI జిల్లా కార్యదర్శి భూక్యా నవీన్, VCK రాష్ట్ర యూత్ అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్, సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ శీలపాక రాజు మన భారత్ రిపోర్టర్ చిట్యాల..

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE