రిమ్స్‌ను సందర్శించిన బీఆర్ఎస్ మహిళా బృందం

Published on

-Advertisement-

రిమ్స్‌ను సందర్శించిన బీఆర్ఎస్ మహిళా బృందం

బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న

మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచలు

మన భారత్, సెప్టెంబర్ 23, ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని పిల్లల వార్డులో సోమవారం రాత్రి చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మహిళా బృందం బుధవారం రిమ్స్ ఆసుపత్రిని సందర్శించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ బృందంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, తుల ఉమ పాల్గొన్నారు. బృందంతో పాటు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జి భూక్య జాన్సన్ నాయక్ రిమ్స్‌కు చేరుకుని బాధితులను పరామర్శించారు.

అగ్ని ప్రమాదం అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను బీఆర్ఎస్ నాయకులు స్వయంగా కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. చికిత్సకు సంబంధించిన వివరాలను వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకుని, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

ఈ సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ రిమ్స్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు, అవసరమైన సహాయ సహకారాలు అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని పేర్కొన్నారు.

ఆసుపత్రుల్లో భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఆసుపత్రుల్లో అగ్ని భద్రత, అత్యవసర రక్షణ వ్యవస్థలు, ఇతర భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

బాధితుల ప్రాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలి

రిమ్స్ అగ్ని ప్రమాద ఘటనలో బాధితుల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత కావాలని అనిల్ జాదవ్ పేర్కొన్నారు. చికిత్స పొందుతున్న వారికి అవసరమైన వైద్య సేవలు నిరంతరం అందేలా అధికారులు పర్యవేక్షించాలని కోరారు. ఘటనకు దారితీసిన పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళా నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

సోయాబీన్ కాయల్లోనే మొలకలు.. రైతుల్లో ఆందోళన

  కోతకు ముందే గింజలు మొలకెత్తడంతో దిగుబడి, నాణ్యతపై ప్రభావం పంటను పరిశీలించి నష్టపరిహారం అందించాలని రైతుల విజ్ఞప్తి మన భారత్, సెప్టెంబర్...

రిమ్స్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది..

మరో ఇద్దరు పసికందుల మృతి.. విషాదంలో కుటుంబాలు ఆసిఫాబాద్‌ లింగాపూర్‌, ఇంద్రవెల్లి దుబ్బగూడకు చెందిన శిశువులూ మృతి మన భారత్‌, సెప్టెంబర్‌...

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

మాజీ సర్పంచ్ రవి నాయక్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన బోథ్ ఎమ్మెల్యే మన భారత్,...

సబ్ స్టేషన్ ఏర్పాటుకు కృషి అభినందనీయం..

మన భారత్, ఆదిలాబాద్:  విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు కు కృషి చేసిన గండ్రత్ సుజాత ఆశన్నతో పాటు సంబంధిత...

More like this