పద్మశాలి సంఘ భవనంలో గణనాథుడిని దర్శించుకున్న మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష

Published on

-Advertisement-

పద్మశాలి సంఘ భవనంలో గణనాథుడిని దర్శించుకున్న మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష
మన భారత్, సెప్టెంబర్20, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పద్మశాలి సంఘ భవనంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిష్టించిన వినాయక విగ్రహాన్ని ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు సందర్శించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ గారితో కలిసి ఆయన గణనాథుడికి ప్రత్యేక పూజలు మరియు హారతి నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాల వేళ విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఆ బొజ్జ గణపయ్య ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. జిల్లాలో ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం మరింత పెంపొందాలని, ప్రతి కుటుంబంలోనూ ఆనందం వెల్లివిరియాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. వినాయకుడి దయతో ప్రజల జీవితాల్లోని విఘ్నాలన్నీ తొలగిపోయి, ఆదిలాబాద్ జిల్లా అన్ని రంగాల్లో మరింత ప్రగతి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకురాలు మంచికట్ల ఆశమ్మ, జిల్లా అధ్యక్షులు జక్కుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కుర్ర రవి, ఆడెల్లు, తాలూకా అధ్యక్షులు ఊషన్న, మాజీ ఎంపీటీసీ నాగన్న, వార్డు కౌన్సిలర్ మహ్మద్‌లతో పాటు సంఘం ప్రతినిధులు, భక్తులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన...

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...

ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు 

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం -మొగుళ్లపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 20 (మన భారత్): వినాయక నిమజ్జన వేడుకలను...

మండల బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా శార్థ పావని స్వామి నియామకం

తలమడుగు మండల బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా శార్థ పావని స్వామి నియామకం: జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు మన భారత్,...

More like this