సీఎం సొంత గడ్డపై టీఆర్ఎస్ ‘పాంచజన్య సంకల్ప సభ’ ఘన విజయం: మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

Published on

-Advertisement-

ముఖ్యమంత్రి సొంత గడ్డపై తెలంగాణ రక్షణ సేన ‘పాంచజన్య సంకల్ప సభ’ ఘన విజయం: మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
మన భారత్, కొడంగల్:
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలోని కోస్గి వేదికగా తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’ అత్యంత ఘన విజయం సాధించింది. పార్టీ అధినేత్రి కవితమ్మ నేతృత్వంలో జరిగిన ఈ భారీ బహిరంగ సభకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నలుమూలల నుండి ప్రజలు, కదిలివచ్చి సభను విజయవంతం చేశారు. ఈ సభలో ముఖ్య వక్తగా పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు, బోథ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ రాథోడ్ బాపురావు మాట్లాడుతూ.. సభను ఇంతటి మహా విజయవంతం చేసిన మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ.. పాలకులు మారుతున్నా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు తమ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు ఇప్పటికీ తీవ్ర వెనుకబాటుతనానికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు కానీ, ప్రస్తుత పాలకులు కానీ ఈ ప్రాంతాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. వెనుకబడిన ప్రాంతాల హక్కుల కోసం, పేదల సంక్షేమం కోసం తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవితమ్మ మరో ఝాన్సీ లక్ష్మీబాయిలా, వీరనారి రుద్రమదేవిలా పోరాట క్షేత్రంలోకి దూకిందని కొనియాడారు.
తెలంగాణ సమాజంలో మార్పు కోసం కవితమ్మ మొదలుపెట్టిన ఈ సంకల్ప పోరాటానికి ప్రజలందరూ అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి, కవితమ్మను ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారానే వెనుకబడిన జిల్లాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని రాథోడ్ బాపురావు స్పష్టం చేశారు. ఈ సభలో పార్టీ ముఖ్య నాయకులు, మహిళలు, యువత ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

 

Latest articles

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన...

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...

ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు 

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం -మొగుళ్లపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 20 (మన భారత్): వినాయక నిమజ్జన వేడుకలను...

పద్మశాలి సంఘ భవనంలో గణనాథుడిని దర్శించుకున్న మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష

పద్మశాలి సంఘ భవనంలో గణనాథుడిని దర్శించుకున్న మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష మన భారత్, సెప్టెంబర్20,...

More like this

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన...

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...

ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు 

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం -మొగుళ్లపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 20 (మన భారత్): వినాయక నిమజ్జన వేడుకలను...