e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

కళాకారుల సమస్యలను పరిష్కరిస్తాం : రవి పటేల్

మన భారత్,మొగుళ్ళపల్లి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేలు భూపాలపల్లి జిల్లాకు చెందిన సాంస్కృతిక కళాకారులు, కోలాటం, భజన కళాకారులు పెద్ద సంఖ్యలో కలిసి తమ సమస్యలను వివరించారు.ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా సాంస్కృతిక కళలను నమ్ముకొని జీవిస్తున్న కళాకారులను గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కళాకారులకు ఇళ్ల స్థలాలు లేదా ఇళ్ల సౌకర్యం, పెన్షన్, కళాకారుల భృతి, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు.అలాగే జిల్లాలోని దేవాలయాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో కళా ప్రదర్శనలకు స్థానిక కళాకారులకే ప్రాధాన్యత కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కళాకారులకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు వారి కళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.అనంతరం కళాకారులు రవి పటేల్‌ను ఉద్దేశించి.. భవిష్యత్తులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తే కళాకారుల సంక్షేమం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడతారని ప్రశ్నించారు.

దీనికి రవి పటేల్ సమాధానమిస్తూ.. బహుజన రాజ్యాధికారం సాధించిన తర్వాత కళాకారుల సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కళలు, కళాకారులు తెలంగాణ సమాజానికి గర్వకారణమని, వారి ప్రతిభను గుర్తించి వారికి తగిన గౌరవం, అవకాశాలు, సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. కళాకారుల సమస్యలను పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దృష్టికి తీసుకెళ్లి, వారి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించేందుకు కృషి చేస్తామని రవి పటేల్ తెలిపారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE