e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

గ్రామ పంచాయతీలకు శుభవార్త.!

పంచాయతీలకు శుభవార్త.. ఇక నిధులు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి

మన భారత్, సెప్టెంబర్ 11, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. పంచాయతీలకు వచ్చే సొంత ఆదాయాన్ని ఇకపై ట్రెజరీలో జమ చేయకుండా నేరుగా ఆయా గ్రామపంచాయతీల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన పంచాయతీరాజ్ చట్టం–2018 సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం లభించింది.

ఇప్పటివరకు గ్రామపంచాయతీలకు వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ట్రెజరీలో జమ చేసిన అనంతరం అవసరమైన సమయంలో నిధులను వినియోగించుకోవడానికి పలు ప్రక్రియలను పూర్తి చేయాల్సి వచ్చేది. దీంతో నిధుల వినియోగంలో జాప్యం, అధికారిక ప్రక్రియల కారణంగా ఇబ్బందులు ఎదురయ్యేవని పంచాయతీ వర్గాలు పేర్కొంటున్నాయి.

తాజా సవరణతో పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని నేరుగా వాటి బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకునే అవకాశం ఏర్పడింది. గ్రామసభ తీర్మానం మేరకు నిధులను గ్రామ అవసరాలకు వినియోగించుకునే వెసులుబాటు కలగనుంది. దీంతో గ్రామాల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిలైట్లు, చిన్నపాటి మౌలిక వసతుల పనులు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను వేగంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

గ్రామాల అభివృద్ధికే ఆదాయం

పంచాయతీలకు వచ్చే ఆదాయం ఆయా గ్రామాల అభివృద్ధికే ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు ఆర్థికంగా మరింత వెసులుబాటు కల్పించడం ద్వారా గ్రామస్థాయిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

ఈ సవరణతో గ్రామపంచాయతీల ఆర్థిక నిర్వహణలో పారదర్శకతతో పాటు స్థానిక అవసరాలకు అనుగుణంగా నిధులను వినియోగించుకునే అవకాశం పెరుగుతుందని అధికారులు, ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు శుభవార్తగా నిలిచిందని పంచాయతీ వర్గాలు పేర్కొంటున్నాయి.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

మీ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE