నిందితుడికి 9 నెలల జైలు శిక్ష.!

Published on

-Advertisement-

దొంగతనం కేసులో నిందితుడికి 9 నెలల 7 రోజులు జైలు

10 మంది సాక్షుల విచారణతో నిందితుడికి శిక్ష

తీర్పు వెలువరించిన ఫస్ట్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి ఎస్. తేజస్విని

మన భారత్, ఆదిలాబాద్:
మోటార్ సైకిల్ దొంగతనం కేసులో నిందితుడికి 9 నెలల 7 రోజుల జైలు శిక్ష విధిస్తూ ఆదిలాబాద్ ఫస్ట్ క్లాస్ కోర్టు (పీసీఆర్) న్యాయమూర్తి ఎస్. తేజస్విని తీర్పు వెలువరించారు. కేసు విచారణలో మొత్తం 10 మంది సాక్షులను ప్రవేశపెట్టగా, నిందితుడిపై నేరం రుజువు కావడంతో కోర్టు శిక్ష ఖరారు చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాపూర్ గ్రామ శివారులో 2025 డిసెంబర్ 3న ఈ దొంగతనం జరిగింది. సాయంత్రం సుమారు 3.30 గంటల సమయంలో ఫిర్యాదుదారు చిర్ల స్వామి తన మోటార్ సైకిల్‌ను పొలం పక్కన నిలిపి వ్యవసాయ పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి వచ్చేసరికి అక్కడ ఉంచిన మోటార్ సైకిల్ కనిపించలేదు.

దీంతో మోటార్ సైకిల్ చోరీకి గురైనట్లు భావించిన స్వామి తలమడుగు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన అప్పటి ఎస్సై డి. రాధిక కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టి నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జంజిరి జిల్లాకు చెందిన దహగన్ తండా నివాసి సొలంకి భగత్ (19), తండ్రి చోటే సొలంకి ని నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. దర్యాప్తు అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచి, అతనిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.

కేసు విచారణ సందర్భంగా కోర్టు సీడీఓ జి. రమేష్ 10 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. నిందితుడికి శిక్ష పడేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. నవీన్ కోర్టులో వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు, సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పీసీఆర్ కోర్టు న్యాయమూర్తి ఎస్. తేజస్విని నిందితుడికి 9 నెలల 7 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.

కేసులో సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమేనని స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. నేరాలకు పాల్పడే వ్యక్తులకు శిక్ష తప్పదని, ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ శాంతియుత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు.

దొంగతనం వంటి నేరాలను అరికట్టేందుకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని, ప్రజలు కూడా తమ వాహనాలు, విలువైన వస్తువుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

తెలంగాణ ఉద్యమ ధీరుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఘన నివాళి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాటం.. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతర కృషి మన భారత్‌,...

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన...

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...

ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు 

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం -మొగుళ్లపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 20 (మన భారత్): వినాయక నిమజ్జన వేడుకలను...

More like this

తెలంగాణ ఉద్యమ ధీరుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఘన నివాళి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాటం.. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతర కృషి మన భారత్‌,...

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన...

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...