కాంగ్రెస్‌కు ప్రజలే గుణపాఠం చెబుతారు.!

Published on

-Advertisement-

అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారు..

తలమడుగు, సెప్టెంబర్ 06: అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కృష్ణ రత్న ప్రకాష్ అన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా సుంకిడి గ్రామంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా తాంసి మాజీ సర్పంచ్ కృష్ణ రత్న ప్రకాష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగిస్తోందని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్రామస్థాయిలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని పేర్కొన్నారు.

రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా నిలిచి మెజారిటీ స్థానాల్లో గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనలో రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులకు పెట్టుబడి సాయం, సాగునీరు, విద్యుత్, పంటల కొనుగోలు వంటి అంశాల్లో గత ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని అన్నారు.

కేసీఆర్ హయాంలో తెలంగాణలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత లభించిందని, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశారని కృష్ణ రత్న ప్రకాష్ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులు, పేదలు, నిరుద్యోగులు, సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజల మద్దతుతో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు అని ఆశాభావం వ్యక్తం చేశారు.

సుంకిడిలో నిర్వహించిన ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తలమడుగు, తాంసి, భీంపూర్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest articles

తెలంగాణ ఉద్యమ ధీరుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఘన నివాళి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాటం.. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతర కృషి మన భారత్‌,...

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన...

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...

ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు 

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం -మొగుళ్లపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 20 (మన భారత్): వినాయక నిమజ్జన వేడుకలను...

More like this

తెలంగాణ ఉద్యమ ధీరుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఘన నివాళి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాటం.. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతర కృషి మన భారత్‌,...

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన...

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...