ఉచితంగా స్కూల్ బ్యాగుల పంపిణీ..

Published on

-Advertisement-

విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగుల పంపిణీ

ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ZPHS సుంకిడి పాఠశాలలో సేవా కార్యక్రమం

సుంకిడి:మన భారత్, సెప్టెంబర్ 4,
విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు వారి విద్యాభ్యాసానికి అవసరమైన సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. దాతల సహకారంతో సుంకిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 6, 7వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠశాల అవసరాలకు ఉపయోగపడే బ్యాగులను అందజేశారు. విద్యార్థులు చదువుపై మరింత ఆసక్తి పెంచుకుని, క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆకాంక్షించారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలవడం అభినందనీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం జయవర్ధన్ రెడ్డి, ఏకలవ్య ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రశాంత్, హరీష్‌తో పాటు ఉపాధ్యాయులు శ్రీనివాస్ స్వామి, గజానన్, రామ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రపుల్ కుమార్, నాందేవ్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను అందించడం పట్ల పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు ఏకలవ్య ఫౌండేషన్‌కు, కార్యక్రమానికి సహకరించిన దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు విద్యకు అవసరమైన సహకారాన్ని అందిస్తాయని వారు పేర్కొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

తెలంగాణ ఉద్యమ ధీరుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీకి ఘన నివాళి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాటం.. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతర కృషి మన భారత్‌,...

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు..

దోస్తీకి అర్థం చెప్పిన స్నేహితులు.. మృతుని కుటుంబానికి ఆర్థిక భరోసా చిట్యాల: అనారోగ్యంతో మృతి చెందిన తిరుమలపురం గ్రామానికి చెందిన...

ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా

సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్‌ 27న బహిరంగ పంచాయతీ సభ మన భారత్‌, సెప్టెంబర్‌ 19, చిట్యాల: సామాజిక న్యాయం,...

ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదు 

ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం -మొగుళ్లపల్లి ఎస్ ఐ ముప్పు సురేష్ మొగుళ్ళపల్లి, సెప్టెంబర్ 20 (మన భారత్): వినాయక నిమజ్జన వేడుకలను...

More like this